బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు టెండర్లు

SMTV Desk 2019-03-16 13:43:07  bullet train project tenders, bullet trains in india

ముంబయి, మార్చ్ 16: దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు టెండర్లును ఆహ్వానించింది. మొత్తం 508 కిలోమీటర్లలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం సూమారు రూ.20 వేల కోట్ల విలువైన 237 కిలోమీటర్లు పనులకు ఈ టెండర్లును ఆహ్వానించినట్లు తెలిపింది. ఈ టెండర్‌ ప్రకారం ప్రాజెక్టును దాదాపు 44 నెలల్లో పూర్తి చేయాలి. కాగా ఈ ప్రాజెక్టు కోసం ఎల్‌అండ్‌టీ, ఏఎఫ్‌సీవోఎన్‌ వంటి భారీ సంస్థలు పోటీలో నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిడ్‌లో విజయం సాధించిన కంపెనీలు జపాన్‌కు చెందిన హటాచీ కన్‌స్ట్రక్షన్స్‌, మిత్సుబిషీ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి పనిచేయాల్సి రావచ్చు. దీంతోపాటు జపాన్‌కు చెందిన సంస్థలు కూడా ఈ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దీనిలో పాల్గొనే సంస్థలు రూ.200 కోట్లను సెక్యూరిటీ మొత్తంగా జమచేయాల్సి ఉంటుంది.