ఫేస్ బుక్ లో తల్లితండ్రుల ఏకాంత దృశ్యాలు

SMTV Desk 2017-05-27 19:04:34  facebook,social media,porn videos

బెంగుళూరు, మే 26 : సెల్ ఫోన్ జాడ్యం ఓ కుటుంబాన్ని నిలువునా ముంచేసింది. ఆప్యాయత, అనుబంధం కోసమై ఇచ్చిన సెల్ ఫోన్ తప్పుడు మార్గాన్నిసృష్టించింది. బెంగళూర్ లో జరిగిన ఘటన తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. సెల్ ఫోన్ ద్వారా ఎంతటి అనర్ధాలు చోటు చేసుకుంటాయో గుణపాఠంగా సమాజానికి పాఠాన్ని బోధించింది. బెంగళూర్ కు చెందిన 13 ఏళ్ళ బాలుడికి తల్లిదండ్రులు స్మార్ట్ పోన్ ను సమకూర్చారు. ఆ బాలుడు సోషల్ మీడియాలో అకౌంట్ తెరువడంతోనే తేజాల్ పటేల్ అనే వ్యక్తి తో పరిచయం మెుదలయింది. ఆయన ఆ బాలుడికి పోర్న్ వీడియోలు పంపడం ప్రారంభించడంతో ఆ బాలుడు వాటికి పూర్తిగా అలవాటు పడ్డాడు. ఆ క్రమంలోనే ఆ బాలుడిని బానిసగా మార్చుకున్న పటేల్ తన ఇంట్లో తల్లిదండ్రుల ప్రైవేటు వీడియోను అప్ లోడ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దాంతో ఆ బాలుడు తల్లిదండ్రుల వీడియోను రహస్యంగా చిత్రీకరించి అకౌంట్ కు అప్ లోడ్ చేశాడు. వాటిని సేకరించిన పటేల్ తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడం తో సైబర్ చట్టం కింద పోలిసులు కేసు నమోదు చేశారు. తేజాల్ పటేల్ ఆచూకి కోసమై గాలిస్తున్నారు.