వైఎస్సాఆర్సీపీలో చేరనున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి

SMTV Desk 2019-03-16 12:35:01  YSRCP, TDP MLA,

హైదరాబాద్, మార్చ్ 16:ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో పైనున్న దేవుడు కూడా ఊహించలేకపోతున్నాడు. క్షణక్షణం ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇటీవలే అధికార టీడీపీ 126 మందితో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఆ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి.. తాజాగా టీడీపీని వీడనున్నట్లు తెలుస్తోంది.

ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరితే.. ఆయన నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ గెలిచే అవకాశం లేదట. దీంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడం కన్నా వైసీపీలో చేరడం బెటర్ అని ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ లో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు ఖాయం కావడంతో టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.