తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు : శింబు

SMTV Desk 2017-08-08 18:26:33  BIG BOSS PROGRAM, TAMIL HERO SHIMBU

ముంబై, ఆగస్ట్ 8 : వివాదాలకు మారుపేరుగా తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో కార్యక్రమం నిలుస్తోంది. ఇటీవల తన కో-పార్టిసిపెంట్ తనను సరిగా పట్టించుకోవడం లేదంటూ ఒవియో అనే పార్టిసిపెంట్ స్విమ్మింగ్ పూల్ లో ముక్కు మూసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ నటుడు శింబు, ఒవియోను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తన పేరుతో ఉన్న ఫేక్ ఎకౌంట్ నుండి వార్తలు వచ్చాయి. దీంతో తమిళ ఛానెల్స్ ఈ వార్తలను ప్రసారం చేయడంతో శింబు సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. అసలు విషయం తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేయడం బాగోలేదు. నిజం తెలిసే వరకు నాకు సంబంధించిన ఎలాంటి వార్తలను టెలికాస్ట్ చేయరాదు. నా నుండి స్వయంగా వస్తే తప్ప అభిమానులు నమ్మవద్దంటూ కోరాడు. ఎవరో కావాలనే ఫేక్ అకౌంట్ తో ట్వీట్ చేసి నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటివి నమ్మవద్దంటూ ఆయన స్పష్టం చేసారు.