వివేకానంద రెడ్డి రాసిన లేఖ వ్యాఖ్యలు

SMTV Desk 2019-03-16 12:30:25  ys vivekananda reddy, YSR Congress party, former Andhra Pradesh Chief Minister YS Rajashekhara Reddys, letter

కడప, మార్చ్ 16: హత్యకు గురైన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ బయటికి వచ్చింది. ఈ లేఖ రాసింది వివేకానే రాశారో లేదో తెలుసుకోడానికి ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తామని పోలీసులు తెలిపారు. రక్తపు మరకతో ఉన్న ఆ లేఖలో.. ‘నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మనానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదలిపెట్టొద్దు. డ్రైవర్‌ను వదలిపెట్టొద్దు.. ఇట్లు వివేకానంద రెడ్డి ’ అని ఉంది. ఈ కేసులో డ్రైవర్ ప్రసాద్‌ను ఇరికించేందుకు యత్నిస్తున్నారని, కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.