తెలంగాణలో ఓటు నమోదుకు నేడే చివరి తేది

SMTV Desk 2019-03-15 18:39:44  telangana voters, voters

హైదరాబాద్, మార్చ్ 15: తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేందుకు ఈ రోజే ఆఖరి తేది. ఆన్‌లైన్‌లో లేదా మీ సేవలో ఓటును దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950 ను సంప్రదించవచ్చు.
ceotelangana.nic.in (or)
https://www.nvsp.in/Forms/Forms/form6 వెబ్‌సైట్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు. ఓటు నమోదు చేసుకునే సమయంలో ఏదైనా గుర్తింపు పత్రం, చిరునామాకు సంబంధించిన పత్రం, కలర్‌ఫోటో తప్పనిసరి.