ధోని vs కోహ్లీ : వీడియో వైరల్

SMTV Desk 2019-03-15 17:26:44  ipl 2019, virat kohli, mahendra singh dhoni, royal challengers benguluru, chennai super kings

చెన్నై, మార్చ్ 15: త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ 2019 లో టీం ఇండియా ఆటగాళ్ళు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరూ తమ తమ టీమ్స్‌కు కెప్టెన్లుగా ఐపీఎల్‌లో తలపడబోతున్నారు. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఈ నెల 23న జరగనుండగా మ్యాచ్‌కు ముందే హీటు పుట్టించే టీజర్లను ఐపీఎల్ రిలీజ్ చేస్తోంది. రెండు జట్ల అభిమానులూ.. ధోనీ, కోహ్లి అనుకుంటూ పోటీలు పడి నినాదాలు చేస్తున్న వీడియోను తాజాగా విడుదల చేశారు. ఆ టీజర్ చివర్లో ధోనీ, కోహ్లి కూడా చాయ్ తాగుతూ.. మ్యాచ్‌లో చూసుకుందాం అంటూ సవాలు విసురుకుంటారు. ఇప్పుడు ఈ వీడియొ నెట్లో చెక్కర్లు కొడుతుంది.