హైదరాబాద్‌కు మరో గుర్తింపు

SMTV Desk 2019-03-15 17:23:22  hyderabad, mersal

హైదరాబాద్‌, మార్చ్ 15: హైదరాబాద్ మహా నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతి సంవత్సరం లగే ఈ ఏడాది మెర్సల్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో శాంతిభద్రతలు, ఇతర అంశాల ఆధారంగా వివిధ ప్రాంతాల వారు భాగ్యనగరంలో నివసించడానికి అనువైన నగరమని హైదరాబాద్‌కు గుర్తింపు దక్కింది. దేశంలో హైదరాబాద్‌తో పాటు పుణె నగరానికి ఈ గుర్తింపు దక్కినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ 21వ వార్షిక సర్వేలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 450 నగరాలను పరిశీలించి 231 నగరాలకు ర్యాంకింగ్‌ ఇచ్చింది. ఇందులో హైదరాబాద్‌, పుణెలకు 143వ ర్యాంకు దక్కగా… బెంగళూరు(149), ముంబై(154), ఢిల్లీ(162) స్థానాలు దక్కాయి. గురువారం విడుదలైన మెర్సర్‌ సర్వే ఫలితాల్లో వరుసగా 10వ ఏట కూడా వియన్నా టాప్‌గా నిలవగా.. జురిక్‌ నగర్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆక్లాండ్‌, మునిచ్‌, వాంకోవర్‌ నగరాలు జాయింట్‌గా మూడోస్థానంలో నిలిచాయి. భద్రతాపరంగా లక్సెంబర్గ్‌ సేఫ్‌ సిటీగా, మనదేశంలో చెన్నయ్‌ భద్రతా పరంగా టాప్‌ అని ఆ సంస్థ తేల్చింది. అదే విధంగా కరాచీలో అభద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన సంస్థ దానికి 226వ స్థానం కేటాయించింది.