పీకల్లోతు మందు తాగి భార్యకు లవ్ టెస్ట్ పెట్టిన భర్త...చివరికి.....

SMTV Desk 2019-03-15 17:21:23  Love test , Drunk man, China , wife and husband

బీజింగ్, మార్చ్ 15: చైనాలోని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యకు తనపై ప్రేమతగ్గిందని భార్యకు లవ్ టెస్ట్ పెట్టాడు. చివరికి అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఈ వింత సంఘటన ఆధారాలు ఇలా ఉన్నాయి. చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే ఓ వ్యక్తి తాగిన మత్తులో ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ కోపంలో నీకు నామీద ప్రేమ లేదని వాదించి బయటకు వచ్చాడు. తాను రోడ్డు మీద వున్నానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వెంటనే రోడ్డుపైకి పరుగెత్తింది. ఆ తర్వాత వెళ్లి రోడ్డు మధ్యలో నిల్చున్నాడు. ఆమె వద్దని ఎంత చేయి పట్టి లాగినా వినకుండా మొండిపట్టుగా నిల్చున్నాడు. ఈ క్రమంలో అతణ్ని రెండు మూడు వాహనాలు తప్పించుకుని పోయాయి. కానీ ఓ వాహనం స్పీడుగా ఇతనిమీదకు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో అతని తలకు, ఛాతీకి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఎందుకిలా చేశావని డాక్టర్లు అడిగితే ‘నిజంగా నా భార్యకు ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని రోడ్డుపై నిల్చున్నాను. చివరికి ఇలా అయింది’ అని చెప్పగానే ఆ డాక్లర్లకు ఎక్కడలేని కోపం వచ్చిందట అతని మీద. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సమీప సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో చూసి చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.