మాజీ మంత్రి తనయుడికి ఏడేళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు

SMTV Desk 2019-03-15 17:14:21  high court, enforcement directorate, karunanidhi, kc mani, ex minister

చెన్నై, మార్చ్ 15: తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రి కొడుకు విదేశీ సంస్థలకు రూ.78 కోట్లను ఎలాంటి ధృవ పత్రాలు, అనుమతులు లేకుండా తరలించారని ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై ఈ రోజు విచారించిన కోర్టు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కరుణానిధి మంత్రి వర్గంలో దివంగత కెసి మణి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన కుమారుడు మణిఅన్బళగన్‌ ఓ బ్యాంకు నుంచి ఎలాంటి ధృవ పత్రాల్లేకుండా విదేశీ సంస్థతో రూ.78 కోట్ల లావాదేవీలు జరిపారు. దీన్ని గుర్తించిన ఈడీ అప్పట్లో ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారించిన చెన్నై కోర్టు తాజాగా మణిఅన్బళగన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు కోటి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.