బిఎస్పితో పొత్తుకు సిద్ధం!

SMTV Desk 2019-03-15 17:13:19  pawan kalyan, mayavati, janasena party, bsp party, loksabha elections, indian prime minister

లక్నో, మార్చ్ 15: బిఎస్పి పార్టీ అధినేత్రి మాయావతితో శుక్రవారం లక్నోలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ...వచ్చే ఎన్నికల్లో ఎపి, తెలంగాణలో బిఎస్ పితో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మాయవతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి అందాలని ఆయన పేర్కొన్నారు. అలాగే భారత ప్రధానిగా మాయావతి గారిని చూడాలని కోరుకుంటున్నా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని పవన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బహుజనుల మద్ధతు కోసం పవన్ బిఎస్పితో పొత్తుకు సిద్ధం కావడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.