RRR హీరోయిన్ : డైసీ ఎడ్గర్ జోన్స్ ఎవరీ ముద్దుగుమ్మ..?

SMTV Desk 2019-03-15 12:56:26  RRR heroine, British

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఛాన్స్ పట్టేసిన డైసీ ఎడ్గర్ జోన్స్ గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారని తెలుస్తుంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కథతో పాటుగా సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ పాత్రల వివరాలు తెలియచేశారు. అంతేకాదు చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్.టి.ఆర్ పక్కన డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుందని అన్నారు.

బ్రిటీష్ బ్యూటీ అయిన డైసీ ఎడ్గర్ జోన్స్ పలు టివి సీరీస్ లలో నటించింది. సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టివి సీరీస్ బ్రిటన్ టివి సీరీస్ లలో నటించింది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన డైసీ ఎడ్గర్ జోన్స్ పాండ్ లైఫ్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తి కలిగి ఉన్న డైసీ ఎడ్గర్ ఇండియన్ సినిమాలో ఛాన్స్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.