సీతారామరాజు మహేష్ ఎందుకు కాలేదు..?

SMTV Desk 2019-03-15 12:55:23  Mahesh Babu, Rajamouli,

ఆర్.ఆర్.ఆర్ నుండి వచ్చిన బిగ్ ఎనౌన్స్ మెంట్.. గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి చెప్పిన స్టోరీ విని మెగా నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. బాహుబలి తర్వాత ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి మరో బాహుబలిని సృష్టిస్తున్నాడని అంటున్నారు. అయితే అందరు హ్యాపీగా ఉన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరుత్సాహపడుతున్నారు. అలా ఎందుకు అంటే సినిమాలో సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తాడట.

అసలైతే తెలుగు తెర మీద అల్లూరి సీతారామరాజు పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతంగా నటించారు. ఆ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. అయితే ఆయన వారసుడిగా అల్లూరి పాత్రలో మహేష్ అయితే బాగుండేది అని కొందరు ఫీలింగ్. దీనికి సమాధానంగా రాజమౌళి కొన్నాళ్ల క్రితం ఓ షోలో తాను మహేష్ తో అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలా అంటే నో అని ఫ్యాన్స్ చెప్పారని.. జేమ్స్ బాండ్ సినిమా అయితే కేకలేశారని అన్నాడు. అందుకే మహేష్ ను కాదని చరణ్ ను ఈ ప్రాజెక్ట్ లో తీసుకున్నారట. అయితే తారక్, చరణ్ ఇద్దరిలో ఎవరు చేయకపోయినా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయేదని చెప్పుకొచ్చారు రాజమౌళి.