శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన సుప్రీం

SMTV Desk 2019-03-15 12:18:41  BCCI, Sreesanth, Supreme Court Cancels Life Ban On S Sreesanth,Asks BCCI To Reconsider Punishment

న్యూఢిల్లీ, మార్చ్ 15: భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ స్పాట్ ఫిక్సింగ్ నేరానికి పాల్పడినందుకుగాను బీసీసీఐ అతనిపై నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నిషేదాన్ని ఎత్తువేస్తూ.. సుప్రీం తీర్పు వెలువరించింది. శుక్రవారం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ఈ కేసును విచారించి బెంచీ అతనిపై నిషేధం విషయంలో మూడు నెలల్లోగా తాజాగా మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా బెంచీ అభివర్ణించింది. కాగా, 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడుతూ పట్టుబడ్డాడు. దీంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. టీం ఇండియా తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడాడు.