పోటీకి నిరాకరించిన సెహ్వాగ్

SMTV Desk 2019-03-15 11:53:41  virendra sehwag, loksabha elections, bjp

న్యూఢిల్లీ, మార్చ్ 15: ఎన్నికల బరిలో దేశ ప్రముఖులను బరిలోకి దించడం మామూలే. ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ బిజెపి తరుపున పోటీ చేస్తారని అనేక వార్తలొచ్చాయి. అయితే దీనికి సెహ్వాగ్ నిరాకరించాడని ఢిల్లీకి చెందిన బిజెపి నాయకుడొకరు స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజకీయ అరంగేట్రం చేయడం లేదని, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి లేదని సెహ్వాగ్‌ చెప్పినట్లు బిజెపి నేత పేర్కోన్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌ బిజెపి టిక్‌ట్‌ మీద హర్యానాలోని రోహ్‌తక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఈ ఏడాది ఫిబ్రవరిలో వార్తలు వెలువడినాయి. దీనిపై సెహ్వాగ్‌ స్పందిస్తూ..ఈ వార్తలు వదంతులేనని కొట్టిపారేశారు.