తెలంగాణకు 29టిఎంసీల కృష్ణా నీరు విడుదల

SMTV Desk 2019-03-15 09:45:14  krishna river, telangana, andhrapradesh, water supply, telangana 29 tmc, andhrapradesh 17.5 tmc

హైదరాబాద్‌, మార్చ్ 14: తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల విడుదలకు సంబంధించి చర్చించేందుకు ఈ రోజు కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణకు 29, ఏపికి 17.5 టిఎంసీల నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏపి తమకు మే నెలాఖరు నాటికి 17 టిఎంసీలు కావాలని కోరింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నదీ జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఈ మేరకు బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌ ఆర్కే జైన్‌ నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయనున్నారు.