ధోనీని తక్కువ అంచనా వేయొద్దు!

SMTV Desk 2019-03-15 09:43:28   Michael Clarke, mahendra singh dhoni, team india, australia

న్యూఢిల్లీ, మార్చ్ 14: బుధవారం ఆసిస్ తో జరిగిన మ్యాచ్ ఓడిపోయి వన్డే సిరీస్ ను టీం ఇండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ పై ఓ క్రికెట్ అభిమాని స్పందిస్తూ క్లార్క్‌కి ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘2011 ప్రపంచకప్‌లో ధోనీతో కలిసి మిడిలార్డర్‌‌లో నిలకడగా రాణించిన యువీ లాంటి బ్యాట్స్‌మెన్‌ను భారత్ జట్టు భర్తీ చేసుకోలేకపోతోంది. ఆస్ట్రేలియా జట్టు మిడిలార్డర్‌లో హ్యాండ్స్‌కబ్, టర్నర్‌లతో సమతూకంగా కనిపిస్తోంది. ఒకరు స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే.. మరొకరు దూకుడుగా ఆడుతున్నారు’ అని సదరు అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి క్లార్క్ స్పందిస్తూ ‘ధోనీని తక్కువ అంచనా వేయొద్దు. జట్టు మిడిలార్డర్‌లో అనుభవం (అనుభవజ్ఞుడులు) చాలా కీలకం’ అని సమాధానమిచ్చాడు. హ్యాండ్స్‌కబ్, టర్నర్‌లు ఇటీవలే ఆస్ట్రేలియా జట్టులో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.