అయోధ్య వివాదం : మధ్యవర్తిత్వ కమిటీ ప్రారంభం

SMTV Desk 2019-03-15 09:39:28  ayodhya case, supreme court, shivasena party, rss chief bhayyaji jhoshi

న్యూఢిల్లీ, మార్చ్ 14: సుప్రీం కోర్టు అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురుసభ్యుల మధ్యవర్తిత్వ కమిటీ తన సంప్రదింపుల విదానాన్ని ఈ రోజు ప్రారంబించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 25 పిటిషన్లు రామజన్మభూమి, బాబ్రిమసీదు వివాదంలో దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ ప్యానెల్‌ముందుకు న్యాయవాదులు మొత్తం హాజరయ్యారు. ప్యానెల్‌ తరపున ఫైజాబాద్‌ జిల్లా యంత్రాంగం కక్షిదారులందరికీ నోటీసులు జారీచేసింది. ముగ్గురుసభ్యుల ప్యానెల్‌ రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు, ఆధ్యాత్మిక గురు శ్రీఎరవిశంకర్‌లు ఫైజాబాద్‌కు మంగళవారమే వచ్చారు. మూడురోజులపాటు ఫైజాబాద్‌లోవారు బసచేస్తారు. కక్షిదారులు, న్యాయవాదులనుంచి వారి విజ్ఞప్తులను స్వీకరించడంతోపాటు వారి వారి అభిప్రాయాలను సైతం తీసుకుంటారు.