ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్స్ వీళ్లే..!

SMTV Desk 2019-03-14 18:14:09  rrr,

హైదరాబాద్, మార్చ్ 14:ఆర్.ఆర్.ఆర్ స్టోరీ చెప్పేసిన రాజమౌళి సినిమా మీద మరింత అంచనాలు పెంచేశాడు. ఇప్పటిదాకా పిరియాడికల్ మూవీ అని మాత్రమే చెబుతున్న ఈ ట్రిపుల్ ఆర్ మూవీ మన తెలుగు రియల్ హీరోస్ కథతో వస్తుందని చెప్పేసరికి ఆడియెన్స్ అంతా అవాక్కయ్యారు. సీతారామరాజుగా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ ఇద్దరు రియల్ లైఫ్ హీరోల పాత్రల్లో నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా జూలై 30, 2020 రిలీజ్ అని కూడా చెప్పారు.

ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ లో తన యాక్టింగ్ టాలెంట్ తో శభాష్ అనిపించుకుంటున్న అలియా భట్ సౌత్ లో చేస్తున్న మొదటి సినిమా ఇది. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఎవరు కాదని చెప్పే సాహసం చేయరు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు. బ్రిటన్ యాక్ట్రెస్ అయిన ఎడ్గర్ జోన్స్ పలు టివి షోలలో చేస్తున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న డైసీ ఎడ్గర్ జోన్స్ ఎన్.టి.ఆర్ పక్కన నటిస్తుంది. మొత్తానికి కొన్నాళ్లుగా ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్స్ పై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు రాజమౌళి. 10 భాషల్లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుందని నిర్మాత డివివి దానయ్య ఎనౌన్స్ చేశారు.