నారా లోకేష్ పై గెలుస్తా

SMTV Desk 2019-03-14 18:09:07  Nara lokesh, Narne Prabhaskar,

హైదరాబాద్, మార్చ్ 14: ప్రముఖ టాలీవుడ్ నటుడు , జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు దూకుడు పెంచారు. ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, వైసీపీలో చేరాలనేది తన వ్యక్తిగత నిర్ణయమని... దీనితో తారక్ కు సంబంధం లేదని చెప్పారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే మంగళగిరి నుంచి నారా లోకేష్ పై పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును తాను దగ్గర నుంచి చూశానని.... చంద్రబాబుకు, జగన్ కు మధ్య చాలా తేడా ఉందని అన్నారు. ఏపీ కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని... ప్రజల కోసం వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారని చెప్పారు. అందుకే తాను జగన్ కు మద్దతిస్తున్నానని తెలిపారు. హైదరాబాదును చంద్రబాబు అభివృద్ధి చేయలేదని... ఎంతో మంది సీఎంలు అభివృద్ధి చేశారని చెప్పారు.