ఆర్.ఆర్.ఆర్ స్టోరీ ఇదే..

SMTV Desk 2019-03-14 15:02:56  RRR, Ram charan, NTR

హైదరాబాద్, మార్చ్ 14: బాహుబలి తర్వాత ఎలాంటి కథతో రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ కథ ఏంటి.. ఎన్.టి.ఆర్, చరణ్ ఎలాంటి పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్నరు అన్నదానికి సమాధానంగా ఈరోజు ప్రెస్ మీట్ లో బిగ్ ఎనౌన్స్ మెంట్ చేశారు రాజమౌళి. 1920లో జరిగే కథగా ఆర్.ఆర్.ఆర్ వస్తుందని.. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారని అన్నారు.

ఇక అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని చెప్పిన రాజమౌళి సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారని వెళ్లడించారు. ఎప్పుడు లేనిది రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ ను ప్రకటించారు. నిర్మాత డివివి దానయ్య 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశామని చెప్పారు.

కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఇద్దరు ఫ్రీడం ఫైటర్స్ గా మారక ముందు జరిగే కథతో ఈ సినిమా వస్తుందట. మొత్తానికి అంచనాలకు తగినట్టుగా రాజమౌళి ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సిని ప్రేక్షకులను ఆశ్చర్యపరచాడు.