బాలీవుడ్ కి పయనం అవుతున్న ప్రముఖ దర్శకుడు

SMTV Desk 2019-03-14 15:00:33  Bollywood, Director Sukumar

హైదరాబాద్, మార్చ్ 14: రంగస్థలం సినిమా భారీ హిట్ అయిన తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ జాతకం మారిపోయిందని అంతా సంబరపడిపోయారు ఆయన అభిమానులు. అయితే ఈ సినిమా విజయం చూసి తమ దర్శకుడు తొలిసారి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేసి రికార్డును బద్దలు కొట్టాడు అంటూ సంబరాలు చేసుకున్నారు. రంగస్థలం ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు పోటీ పడతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే మహేష్ బాబు సినిమా కన్ఫర్మ్ అయ్యేసరికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కక ముందే అటకెక్కేసింది. క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా సుకుమార్ మహేష్ బాబు సినిమా ఆగిపోయింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సినిమాలు ఈ మధ్య కన్ఫర్మ్ చేశాడు ఈ దర్శకుడు. కానీ ఇప్పుడు బన్నీ సినిమా కూడా ఆలస్యం అవుతుందని, దాంతో ఈ గ్యాప్ లో ఆయన బాలీవుడ్ సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. అందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా ఇంకా మొదలు కాలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత కానీ సుకుమార్ సినిమా పట్టాలెక్కించలేడు అల్లు అర్జున్. అప్పటి వరకు ఈ దర్శకుడు ఖాళీగా ఉండక తప్పదు. అందుకే ఈ గ్యాప్ లో బాలీవుడ్ వెళ్లి నాన్నకు ప్రేమతో సినిమాను రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడు సుకుమార్. ఆమధ్య ఆర్య సినిమాను హిందీలో రీమేక్ చేస్తాడనే వార్తలు వచ్చినా కూడా అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తేలిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం నాన్నకు ప్రేమతో సినిమా బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో తో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. ఇక్కడ ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి ఆ గ్యాప్లో ముంబై వెళ్లి అక్కడ వాళ్లకు హాయ్ చెప్పి రావాలని చూస్తున్నాడు సుకుమార్.