త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా టైటిల్ ఇదేనా?

SMTV Desk 2019-03-14 14:21:43  Trivikram, Bunny, Allu arjuna

హైదరాబాద్, మార్చ్ 14: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా ఇంకా ప్రీ – ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కాలేదు ఇంతలోనే ఈ సినిమా టైటిల్ పై రూమర్లు మొదలయ్యాయి. సినిమా కథ ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుందని, సన్నాఫ్ సత్యమూర్తి తరహాలోనే ఈ కథ ఉండనుండదని వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, కేథరిన్ తెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు “నాన్న నేను” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ బన్నీల కాంబోలో వచ్చిన గత చిత్రం సన్నాఫ్ సత్యమూర్తిని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది, ఆ నమ్మకంతోనే ఇప్పుడు చేయబోయే సినిమా కోసం కూడా ఫాదర్ సెంటిమెంట్ తో నిండిన కథనే త్రివిక్రమ్ రెడీ చేస్తున్నారని టాక్. మరి, ఈ వార్తల్లో నిజమెంతో తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.