నారా లోకేష్ కి సరైన అభ్యర్థిని దింపనున్న వైసీపీ

SMTV Desk 2019-03-14 12:18:24  Nara Lokesh,YCP,

అమరావతి, మార్చ్ 14: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ కి ఎట్టకేలకు అసెంబ్లీ స్తానం ఖరారు అయింది. కాగా లోకేష్ ను గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీకి దింపాలని అధిష్టానం ఇటీవలే నిర్ణయించింది. ఎలాగో లోకేష్ పోటీ చేసేది రాజధాని ప్రాంతం కావడంతో ఎలాగైనా లోకేష్ విజయం సాధించవచ్చని చంద్రబాబు అంచనా వేశాడు. కాగా గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాదించినటువంటి వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి ని ఓడించాలంటే లోకేష్ ని దింపడమే సరైన నిర్ణయమని చంద్రబాబు అనుకున్నారు. కాగా లోకేష్ కి ఉన్నటువంటి పలుకుబడి ప్రకారం తనని ఓడించాలని వైసీపీ అధినేత జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

మంగళగిరిలో లోకేష్ కి పోటీగా ప్రముఖ నటుడు ఎన్టీఆర్ వాళ్ళ మామ నార్నె శ్రీనివాస్ ను బరిలోకి దింపనున్నారని సమాచారం. ముందుగా ఆ స్థానాన్ని ఉడుత శ్రీనుకు కేటాయించాంగం తాజా పరిణాలమాల దృష్ట్యా మంగళగిరి స్థానాన్ని నార్నె శ్రీనివాసరావుకు అప్పగించారని సమాచారం. కాగా పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాలను మర్చి కొత్త పోకడలకు దారి తీస్తుందని తెలుస్తుంది. కాగా ఈ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థుల్లో పోటీ గట్టిగానే ఉండనుందని సమాచారం.