పేటీఎంలో మరో కొత్త స‌దుపాయం

SMTV Desk 2017-08-08 13:12:45  paytm, wallet, money transfer

హైదరాబాద్, ఆగస్ట్ 8 : ఇటీవల పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలు పెద్దఎత్తున మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ-వ్యాలెట్‌ యాప్స్‌ పంట పండింది. అయితే, ఇదివరకే పేటీఎం కొత్త అప్‌డేట్ ను తీసుకువచ్చింది. దీనిలో డబ్బుతో పాటు కస్టమైజ్డ్ గ్రీటింగ్ కార్డును పంపుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ గ్రీటింగ్ కార్డు స‌దుపాయంతో డ‌బ్బు పంపుకునే సౌక‌ర్యానికి కొత్త హంగులు జోడించారు. అలాగే "పేటీఎం ఆటోమేటిక్" పేరుతో ముందే వ్యాలెట్‌లో నిర్ణయించిన డ‌బ్బు కనీస పరిమితికి తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వ్యాలెట్‌ను నింపే స‌దుపాయాన్ని క‌ల్పించింది. కాని ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌కు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. డబ్బుతో పాటు పంపిన పోస్ట్ కార్డ్ ను కనుక పది రోజుల్లోగా రిడీమ్ చేసుకోకపోతే 100 శాతం డబ్బును తిరిగి పంపిన వారి ఖాతాలోకి పేటీఎం జ‌మ చేస్తుంది. అంతేకాకుండా తాజాగా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న కాంటాక్టుల‌కు కూడా డ‌బ్బు పంపుకునే సదుపాయాన్ని పేటీఎం కల్పించిన విషయం తెలిసిందే.