ఈ నెల 22న ప్రభుత్వ సెలవు

SMTV Desk 2019-03-14 09:33:27  telangana state government, government holiday, march 22, mlc elections

హైదరాబాద్, మార్చ్ 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న సెలవు ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలిపింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక సాధారణ సెలవు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు.