ఆర్‌కామ్‌పై కోర్టు సంచలన తీర్పు

SMTV Desk 2019-03-14 09:28:26  RCom chairman Anil Ambani , RCom, Anil Ambani,

న్యూఢిల్లీ, మార్చ్ 13: అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన ఆర్‌కామ్‌ పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారయ్యింది. ఆర్‌కామ్‌ వచ్చిన పన్ను రీఫండ్స్‌ను బ్యాంక్‌ నుంచి విడుదల చేయించుకుని అప్పులు చెల్లించకపోతే కోర్టు దివాలా పరిష్కార ప్రక్రియ పంపే అవకాశం ఉందని సమాచారం. కంపెనీ చెల్లింపులు పూర్తి చేయకపోతే దివాలా పరిష్కార ప్రక్రియ నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకొంటాము అని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ వెల్లడించింది. ఈ కేసును మంగళవారం ఇద్దరు సభ్యుల ట్రిబ్యునల్‌ విచారించింది. బ్యాంకులో ఉన్న రూ. 260 కోట్ల పన్ను రీఫండ్‌ మొత్తాన్ని విడుదల చేయాలని కోరిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. మరోపక్క ఆర్‌కామ్‌ మార్చి 19 నాటికి స్వీడిష్‌ కంపెనీ ఎరిక్సన్‌కు రూ. 453 కోట్లు చెల్లించాల్సి ఉంది. లేకపోతే అనిల్‌ అంబానీ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.