ఎన్నికల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన మమత

SMTV Desk 2019-03-14 09:25:30  mamatha benarjee, trinamool congress party, loksabha elections, bjp, election commission

న్యూఢిల్లీ, మార్చ్ 13: పశ్చిమబెంగాల్ సిఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ లోక్‌ సభ ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా ఈ రోజు కోల్‌ కతా లోని తన నివాసంలో టీఎంసీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా.. లోక్‌ సభ అభ్యర్థులను జాబితాను విడుదల చేశారు. రాష్ట్రంలోని 42 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమె ఈ సారి మహిళలకు 40.5శాతం మహిళలకే ఇస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంన్నందుకు గర్వంగా ఉందని మమతా తెలిపారు.