చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా

SMTV Desk 2019-03-14 09:20:08  china, masood azhar, international criminal, terrorists, jaies eh mohammed, united nation organisation, india, america

వాషింగ్టన్‌, మార్చ్ 13: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితిలో మరి కొద్ది గంటల్లో అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించే క్రమంలో భద్రతా మండలి మరోసారి సమావేశం కానుంది. అయితే ఈ తీర్మానాన్ని చైనా అడ్డుకునేందుకు భావిస్తున్నట్లు సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో చైనాకు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు అన్ని విధాలుగా అర్హుడని, ఈ ఉగ్రవాదుల జాబితాను అప్‌డేట్ చేయకుండా చైనా అడ్డుపడటం అమెరికాతోపాటు ఆ దేశ ప్రయోజనాలకు కూడా విరుద్ధమేనని అమెరికా విదేశాంగ ప్రతినిధి రాబర్ట్ పాలాడినో అన్నారు. అజర్.. జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడని, అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఇంతకన్నా ఇంకేం కావాలని రాబర్టో అన్నారు.