20 రకాల ప్రొడక్ట్స్ పై తగ్గనున్న జీఎస్టీ రేటు!

SMTV Desk 2017-08-08 12:04:55  gst, food products, branded items

ఢిల్లీ, ఆగస్ట్ 8 : నిత్యం వాడే పలు ఆహారోత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. కొన్ని అవకతవకలు, ఆయా వర్గాల నుంచి ఎదురైన వ్యతిరేకతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం పన్ను ఉండగా, బ్రాండెడ్‌ కాని ఆహార వస్తువులను జీఎస్‌టీ నుంచి మినహాయించారు. ఈ తరుణంలో పన్ను భారాన్ని తప్పించుకునేందుకు తమ ప్రొడక్టులను బ్రాండెడ్ జాబితా నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. ఈ విషయం గురించి మే 15 నాటికి ఏ ఆహార ఉత్పత్తులైతే బ్రాండెడ్ జాబితాలో ఉంటాయో వాటన్నింటిపైనా 5 శాతం పన్ను కొనసాగేలా నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ లో సెప్టెంబరు 9న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.