“అవినీతి డబ్బా, అవినీతి పత్రిక” లోకేష్ ట్వీట్ వైరల్

SMTV Desk 2019-03-14 09:04:26  Nara Lokesh,

అమరావతి, మార్చ్ 13: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు మొదలైంది ఏపీ, తెలంగాణల్లో ఒకేసారి ఎన్నికలు జరుగనుండటంతో తెలుగునాట రాజకీయ సమీకరణాలు ఘననీయంగా మారుతున్నాయి. ఎన్నికలకు గట్టిగా నెలరోజుల సమయం కూడా లేకపోవటంతో పార్టీలన్నీ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయటం, ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేయటంలో తలమునకలయ్యాయి. అభ్యర్థుల జాబితా రెడీ చేయటంలో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది,ఇప్పటికే అభ్యర్థుల జాబితా రెడీ అయిపోయిందని సమాచారం. ఇదిలా ఉండగా మంత్రి గంటా శ్రీనివాస రావుకు ఎమ్మెల్యే టికెట్ దక్కే ఛాన్స్ లేదని , ఆయనను ఎంపీగా పోటీ చేయించనున్నారని, అందుకే ఆయన పార్టీ అధిష్టానంపై అలక బూనారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారానికి తెర దించుతూ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రతిపక్ష వైసీపీకి కౌంటర్ ఇచ్చారు,గంటాతో ఆయన దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ “అవును నిజమే గంటా శ్రీనివాసరావు గారి మోహంలో అలక చుడండి” అంటూ ఇద్దరు నవ్వుతూ దిగిన సెల్ఫీని పోస్ట్ చేసారు. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో సాక్షి ఛానల్ లో “మంత్రి గంటా శ్రీనివాస్ అలక” అంటూ బ్రేకింగ్ న్యూస్ ఉండటం గమనార్హం. ఆ ట్వీట్ లో లోకేష్ సాక్షి ఛానల్ ను “అవినీతి డబ్బా, అవినీతి పత్రిక” అని పేర్కొన్నారు, మొత్తానికి ఒక్క ట్వీట్ తో వైసీపీకి కౌంటర్ తో పాటుగా, టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు.