మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ

SMTV Desk 2019-03-13 15:37:15  Mangalagiri, Lokesh,

అమరావతి, మార్చ్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యం లో రాబోయే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. మంగళగిరిలో టీడీపీ బలీయంగా ఉన్న నేపథ్యంలో లోకేశ్ పోటీచేస్తే విజయం నల్లేరుపై నడకలా మారుతుందని భావిస్తున్నారు.

మంగళగిరి టికెట్ ను ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కాకుండా ఓ బీసీ నేతకు కేటాయించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి దిగబోతున్న నేపథ్యంలో ఆయన్ను ఓడించేందుకు దీటైన అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపవచ్చని భావిస్తున్నారు.