అయోమయంలో చంద్రబాబు ..

SMTV Desk 2019-03-13 15:28:42  Chandra Babu, Lokesh,

కుప్పం, మార్చ్ 13: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి జోరుగా ఊపందుకుంటుంది . అందరు కూడా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు… కానీ అధికార పార్టీకి కొత్త చిక్కు వచ్చిపడింది. ముఖ్యమంత్రి కొడుకు, ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన స్తానం కూడా దొరకడం లేదు. ఎందుకంటే తాను గెలుస్తాడా లేదా అనేది ఇప్పుడు టీడీపీ కి పెద్ద ప్రశ్నగా మారించి. అంతేకాకుండా చంద్రబాబు లీకుల మీద లీకులిచ్చేస్తున్నారు. ఈ లీకులతో లోకేష్ సామర్ధ్యంపై అందరిలోను అనుమానాలు పెరుగుతున్నాయి. ముందు హిందుపురం, తర్వాత కుప్పం, ఆ తరువాత భీమిలి దాదాపుగా ఖరారు అన్నారు కానీ చివరికి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గమంటున్నారు. మళ్ళీ ఇది కూడా మారుతుందా లేక పోటీ నుండి తప్పుకుంటాడో చూడాలి ఇక.

అసలు లోకేష్ కుప్పం నియోజకవర్గం కాకుండా మరెక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని అందరు అనుకుంటున్నారు కూడా… లోకేష్ సామర్త్యం ఏంటో ప్రజలందరికి తెలుసు. చంద్రబాబు చేయాల్సింది ఒక్కటే ఇక తన సొంత స్థానమైన కుప్పం నియోజకవర్గాన్ని లోకేష్ కు అప్పగించటం ఒకటే మార్గం. కాగా చంద్రబాబు ఎక్కడనుండి పోటీ చేసినా గెలుపు ఈజీనే. అందుకే చంద్రబాబు వేరే స్థానం నుండి పోటీ చేసి లోకేష్ కి కుప్పం అప్పగించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.