మార్చి 14న రాజమౌళి ప్రెస్ మీట్..!

SMTV Desk 2019-03-13 12:38:11  Rajamouli, pressmeet

హైదరాబాద్, మార్చ్ 12:బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించి మార్చి 14న రాజమౌళి ప్రెస్ మీట్ పెడుతున్నాడట. సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టడమే కాకుండా రాజమౌళి కథ చూచాయగా చెప్పే అవకాశం ఉందట.

అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కు సంబందించి కూడా రాజమౌళి ప్రెస్ మీట్ తో మొదలుపెడతారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ ను మరో బాహుబలి చేసే ఆలోచనలో ఉన్న రాజమౌళి సినిమా గురించి ఆడియెన్స్ కు ముందే ఓ హింట్ ఇవ్వాలని చూస్తున్నాడట. ఇప్పటికే సినిమా ఓ పిరియాడికల్ డ్రామాగా వస్తుందని తెలుస్తుంది. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా మార్చి 14న క్లారిటీ ఇస్తారని అంటున్నారు. మరి ఆర్.ఆర్.ఆర్ గురించి రాజమౌళి ఆరోజు ఏం చెబుతాడన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.