జగన్ పై సస్పెక్ట్ చార్జిషీట్ ఓపెన్ చేయాలి: తెలుగుదేశం నాయకులు

SMTV Desk 2017-08-07 19:09:53  Chandrababu Naidu, Andhrapradesh Cheif minister, Varla ramaiah, AP DGP, Shamba sivarao, YS Jagan

అమరావతి, ఆగష్ట్ 7: నంద్యాల బహిరంగ సభలో వైకాపా అధినేత జగన్ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లగా జగన్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా తెలుగుదేశం నాయకులు వర్ల బద్దాలు ఏపీ డీజీపీ సాంబశివరావును కలిసి చంద్రబాబునాయుడిని బహిరంగంగా కాల్చి చంపాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. జగన్ పై సస్పెక్ట్ చార్జిషీట్ ఓపెన్ చేయాలని వారు డిమాండ్ చేసినట్లు సమాచారం.