జనసేనాని పోటీ అక్కడినుంచే!

SMTV Desk 2019-03-13 12:25:03  janasena party, pawan kalyan, andhrapradesh assembly elections, loksabha elections, vishakapatnam district, gajuvaka constituency

అమరావతి, మార్చ్ 12: ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైనట్లు తెలుస్తుంది. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుండి పవన్‌ పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ రోజు పవన్ పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే విశాఖ ఉత్తరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారని తెలుస్తుండగా ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనితెలుస్తుంది.