ఓటు హక్కును వినియోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు

SMTV Desk 2019-03-13 12:23:54  trs, ktr, kcr, pocharam srinivas reddy, mlc elections, voting

హైదరాబాద్‌, మార్చ్ 12: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తొలి ఓటును స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వినియోగించుకోగా. రెండో ఓటును టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ వినియోగించుకున్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు. అలాగే టిఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ ప్రక్రియ అసెంబ్లీ కమిటీ హాల్‌1లో కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. టీఆర్‌ఎస్‌ నుంచి మహముద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, ఎగ్గె మల్లేశం, సత్యవథి రాథోడ్‌, మజ్లిస్‌ నుంచి రియాజ్‌ పోటీలో ఉన్నారు.