టాయిలెట్లో దూరి ఓ స్త్రీని మానబంగం చేయబోయాడు

SMTV Desk 2019-03-12 17:01:57  dubai, rape, toilet, women, police case

దుబాయ్‌, మార్చ్ 12: బుర్‌ దుబాయ్‌లోని బిజినెస్‌ బే ప్రాంతంలో ఓ వ్యక్తి మహిళా టాయిలెట్లో దూరి ఓ స్త్రీ ని మానబంగం చేయబోయాడు. పూర్తి వివరాల ప్రకారం...ఓ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న మహిళ టాయిలెట్‌కి వెళ్లింది. అయితే అదే సమయంలో అక్కడి సెక్యూరిటీ సూపర్ వైజెర్ తనపై కన్నేసి ఆమె టాయిలెట్‌లో దూరగానే అతను కూడా అందులో దూరి తలుపులు వేసాడు. ఆపై ఆమె వస్త్రాలు అన్నీ చింపేసి నగ్నంగా చేసి ఆమె శరీరంపై ముద్దులు పెడుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుగ్గను కొరికి గాయం కూడా చేశాడు. చివరకు తలుపు వద్ద ఏదో అలికిడి వినిపించడంతో అక్కడ నుండి పరారయ్యాడు. అక్కడ ఉన్న వారు వెంటనే పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించారు. పోలీసులు ఆఫీసుకు చేరుకున్నారు. అదే విధంగా స్నేహితురాళ్లకు కూడా సమాచారం అందించడంతో వారు ఆఫీసుకు బట్టలు తెచ్చిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు న్యాయమూర్తి నేరస్తుడికి మార్చి 25న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపారు.