అవసరాల 'గమ్మత్తైన టైటిల్' విన్నారా ..

SMTV Desk 2019-03-12 16:38:15  awasarala srinivas,

అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఊహలు గుసగుసలాడే సినిమా, అప్పట్లో ఈ సినిమా ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. నాగశౌర్యకు హీరోగా ఇదే మొదటి సినిమా, అంతకు ముందు చందమామ కథలు సినిమాలో ఒక క్యారెక్టర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత నాగశౌర్యకు వరుసగా మంచి ఆఫర్లయితే వచ్చాయి గానీ, ఆశించిన స్థాయిలో ఒక్క హిట్ కూడా పడలేదు. చాలా కాలం తర్వాత అవసరాల, నాగశౌర్య కలిసి సినిమా చేయనున్నారు, ఈ సినిమాకు “ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది,శ్రీనివాస్ అవసరాల మునుపటి సినిమాల్లాగే ఈ సినిమాకు కూడా గమ్మత్తైన టైటిల్ ను ఫిక్స్ చేసారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమా ఎక్కువ భాగం ఫారిన్ లో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఈ సినిమాలో నాగశౌర్య సరసన మాళవిక నాయక్ హీరోయిన్ గా నటించబోతోంది. మర్చి రెండోవారం నుండి షూటంగ్ మొదలు కానున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, దాసరి ప్రొడక్షన్స్ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మరీ, ఊహలు గుస గుసలాడే, జ్యో అచ్యుతానంద వంటి హిట్స్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుండి వస్తున్న ఈ సినిమా ఛలో తర్వాత మంచి హిట్ అంటూ లేని నాగశౌర్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.