మంచిర్యాలలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించిన పోలీసులు

SMTV Desk 2019-03-12 16:34:07  Mancherial Police Conducts Cordon Search, Seizes 124 Vehicles

మంచిర్యాల, మార్చ్ 12: మంచిర్యాలలో పోలీసులు తాజాగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. నస్పూర్ మండలంలోని కృష్ణకాలని లోని సింగరేణిలో డిసిపి రక్షిత ఆధ్వర్యంలో రామగుండం సిపి ఆదేశాల మేరకు పోలీసులు నిర్బంధ తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ....ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. సరైన పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 8 కార్లు, 6 ఆటోలు, 75 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. త్వరలో జరగబోయే కేంద్ర సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండలనే ఉద్దేశంతోనే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని ఆమె తెలిపారు. అంతే కాకుండా ప్రజలకు పోలీసుల సేవలు ఎల్లప్పుడూ అందిస్తామని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.