తన పాపను ఎయిర్ పోర్టు వెయిటింగ్ లాంజ్ లో మరిచిపోయి విమానమెక్కిన మహిళ

SMTV Desk 2019-03-12 16:01:25  dubai, airport, women, child, plane takeoff

దుబాయ్, మార్చ్ 12: సౌదీ అరేబియాలోని ఓ విమాశ్రయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన పాపను మరిచిపోయి విమానం ఎక్కింది. పూర్తి వివారాల ప్రకారం ఓ మహిళ తన పాపను ఎయిర్ పోర్టు వెయిటింగ్ లాంజ్ లోమరిచిపోయి .. విమానం ఎక్కింది. ప్లైట్ టేక్ ఆఫ్ కూడా అయ్యింది. ఆ తర్వాత తెరుకున్న ఆమె పరుగెత్తుకుంటూ విమాన సిబ్బంది వద్దకు వెళ్లి ఎయిర్ పోర్టు బోర్డింగ్ లాంజ్ లో పాపను మరచిపోయానని చెప్పింది. అయితే విమానాన్ని మళ్ళీ దింపేందుకు పైలట్ ఏటీసీతో సంప్రదింపులు జరిపారు. ఏం జరిగింది ? ఎందుకు విమానం ల్యాండ్ చేస్తారని ఏటీసీ అధికారులు అడుగగా ఎయిర్ పోర్టు వెయిటింగ్ లాంజ్ లో ఓ మహిళ తన పాప మరచిపోయిందని తెలిపారు. ఈ విషయం చెప్పడంతో ఏటీసీ అధికారులు విశ్వసించలేదు. మరోసారి కన్ఫామ్ చేయండి .. పాపను మరచిపోయినందుకే ఎయిర్ పోర్టులో తిరిగి ల్యాండ్ చేస్తారా మరే కారణం ఉందా ? అని ప్రశ్నించారు. దీనికి పైలట్ అదే నిజమని, మరే కారణం లేదని చెప్పారు. మీరు అనుమతిస్తే విమానం ల్యాండ్ చేస్తామని .. లేదంటే తిరిగి వెళ్లిపోతామని చెప్పడంతో చివరకి పర్మిషన్ ఇవ్వడంతో విమానం ల్యాండైంది.