తగ్గుముఖం పట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు

SMTV Desk 2019-03-12 13:01:50  Petrol, Deseal, Price, New delhi

మార్చ్ 12: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్ 5 పైసలు తగ్గితే.. డీజిల్ ధర 7 పైసలు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.41 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.67.37 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 78 మార్క్ పైనే కొనసాగుతోంది. రూ.78.04 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.70.58 వద్ద ఉంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 77 మార్క్‌‌కు సమీపంలో కదలాడుతోంది. రూ.76.84 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.73.25 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.76.57 వద్ద, డీజిల్‌ ధర రూ.72.58 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.20 వద్ద, డీజిల్ ధర రూ.72.24 వద్ద కొనసాగుతోంది.

మార్చి 12న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:

*ఢిల్లీ పెట్రోలు ధర (లీటరు)రూ.72.41.....డీజిల్ ధర (లీటరు)రూ.67.37
*ముంబయి పెట్రోలు ధర (లీటరు)రూ.78.04.....డీజిల్ ధర (లీటరు)రూ.70.58
*కోల్‌కతా పెట్రోలు ధర (లీటరు)రూ.74.49.....డీజిల్ ధర (లీటరు)రూ.69.16
*చెన్నై పెట్రోలు ధర (లీటరు)రూ. 75.20.....డీజిల్ ధర (లీటరు)రూ.71.20
*బెంగళూరు పెట్రోలు ధర (లీటరు)రూ.74.82.....డీజిల్ ధర (లీటరు)రూ.69.60
*తిరువనంతపురం పెట్రోలు ధర (లీటరు)రూ.75.73.....డీజిల్ ధర (లీటరు)రూ.72.42
*హైదరాబాద్ పెట్రోలు ధర (లీటరు)రూ.76.84.....డీజిల్ ధర (లీటరు)రూ.73.25
*అమరావతి పెట్రోలు ధర (లీటరు)రూ.76.57.....డీజిల్ ధర (లీటరు)రూ.72.58
*విజయవాడ పెట్రోలు ధర (లీటరు)రూ.76.20.....డీజిల్ ధర (లీటరు)రూ.72.24.