ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

SMTV Desk 2019-03-12 11:17:57  mlc elections, telangana legislative assembly, trs, kcr, mla

హైదరాబాద్‌, మార్చ్ 12: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ మొదలైంది. మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు జరుగుతుంది. కాగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కాంగ్రెస్‌ పోటీలో లేనందున ప్రథమ ప్రాధాన్య క్రమంలోనే టిఆర్‌ఎస్‌, మజ్లిస్‌ సభ్యులు గెలవడం ఖాయమైంది. మండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి వి.నరసింహాచార్యులు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రియాజ్(మజ్లీస్), సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.