దసరా రేస్‌లో మాస్ మహా రాజా

SMTV Desk 2019-03-12 09:26:05  dasara, Disko raja

హైదరాబాద్, మార్చ్ 12: మాస్ మహా రాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డిస్కోరాజా’ చిత్రం ఇటీవల రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎక్కువ ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలిపాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రవితేజకు జంటగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘డిస్కో రాజా’ చిత్రంతో పెద్ద హిట్‌ను అందుకోవాలని రవితేజ, వి.ఐ.ఆనంద్‌లు కోరుకుంటున్నారు. ఇక దర్శకుడు ఈ చిత్రంలో హీరో పాత్ర కథ, కథనాలను కొత్తగా రాసుకున్నాడట. ఈ చిత్రాన్ని సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు వి.ఐ.ఆనంద్. మొత్తానికి దసరా రేస్‌లో మొదటి బెర్త్ ‘డిస్కో రాజా’ ఖరారు చేసుకున్నట్టే.