శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం

SMTV Desk 2019-03-12 07:47:43  sharad pawar, Congress, ncp,

న్యూ ఢిల్లీ,మార్చ్ 11: రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ ఈ రోజు ప్రకటించారు. మహారాష్ట్రలోని మాదా నియోజకవర్గం నుంచి పవార్‌ లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని కొద్ది రోజుల క్రితం వార్తొలొచ్చాయి. ఈ వార్తలని కొట్టి పారేస్తూ పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పుణెలో ఈ రోజు నిర్వహించిన పార్టీ సీనియర్ల సమావేశంలో పవార్‌ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మాధా నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయట్లేదని ఆయన తెలిపారు.

ఈ సందర్బంగా పవార్‌ మాట్లాడుతూ.. నా కుటుంబంతో, స్నేహితులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. తర్వాతి తరాలకు అవకాశమివ్వాలి. ఎంతోమంది నియోజక వర్గ ప్రజలు, పార్టీ నాయకులు నన్ను పోటీ చేయమని అంటున్నారు. వారి మాట కాదని అంటున్నందుకు, వారిని నొప్పిస్తున్నందుకు మన్నించాలి. నా కుటుంబం నుంచి ఇప్పటికే ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను పోటీ నుంచి తప్పుకోవడం ఇదే సరైన సమయం అని తెలిపారు.