ట్విట్టర్ లో రక్షాబంధన్ శుభాకంక్షలు తెలిపిన లోకేష్, జగన్

SMTV Desk 2017-08-07 16:25:29  Nara Lokesh, YS Jagan, Rakshabhandhan, AP IT Minister, YS Sharmila, AP CM

అమరావతి, ఆగష్ట్ 7: ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం సచివాలయంలో తన తోటి రాజకీయ నేతలతో కలిసి రక్షా బంధన్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా, మంత్రి లోకేష్‌కు కొందరు మహిళా నాయకులు రాఖీలను కట్టి, అతనికి స్వీట్స్ తినిపించారు. నా సోదరీమణులతో సచివాలయంలో రక్షా బంధన్ వేడుకలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు, లోకేష్ ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ నేపధ్యంలో సోదరీమణులందరికి రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ... కొన్ని ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి పరిటాల సునీత రాఖీని కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలా ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాఖీని కట్టారు. ఈ సంతోషకరమైన క్షణాలను ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలందరితో పంచుకున్నారు. జగన్ సోదరీమణులందరికి రాఖీ శుభాకాంక్షలు తెలుపుతు ట్వీట్ చేశారు.