మహిళా ఉద్యోగులకోసం ఐసిఐసిఐ బ్యాంక్ స్పెషల్ ఆఫర్

SMTV Desk 2019-03-12 07:23:38  icici bank, working women Offers

మార్చ్ 11: దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులల్లో రెండో స్థానంలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగ మహిళల కోసం ఓ నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగుల కోసం‘ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాక ఈ అకౌంట్ ప్రారంభించిన వారు షాపర్స్‌స్టాప్ గిఫ్ట్ కార్డ్ పొందొచ్చు. తనిష్క్, ఓలా నుంచి వోచర్లు కూడా అందుతాయి. అలాగే బిగ్ బాస్కెట్, లాకర్ రెంటల్స్ కొనుగోళ్లలో డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వినియోగంపై క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ ప్రత్యేకతలు..

✪ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వినియోగం వల్ల రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అన్ని బ్యాంకుల ఏటీఎంలలోనూ ఎన్ని సార్లైనా కార్డు ఉపయోగించొచ్చు.
✪ ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లలో లాకర్ రెంటల్స్‌పై 50 శాతం తగ్గింపు పొందొచ్చు.
✪ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్ లభిస్తుంది. వడ్డీ రేట్లు వారికి ప్రత్యేకంగా ఉంటాయి. హోమ్ లోన్, హోమ్ లోన్ టాప్-అప్ తీసుకున్నవారికి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం మినహాయింపు ఉంటుంది.
✪ హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.
✪ టూవీలర్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజులో రూ.499 తగ్గింపు, వాహనానికి 100 శాతం ఆన్-రోడ్ ప్రైస్ రుణంగా పొందొచ్చు.
✪ షాపర్స్‌స్టాప్ నుంచి రూ.2,000 గిఫ్ట్ వోచర్
✪ మూడు నెలలకు ఒకసారి ఎయిర్‌పోర్ట్ లాంజ్ కాంప్లిమెంటరీ యాక్సెస్
✪ రూ.250 విలువైన ఓలా వోచర్
✪ బిగ్‌బాస్కెట్‌లో నెలకు ఒకసారి రూ.1,000 కొనుగోలుపై రూ.250 డిస్కౌంట్
✪ సిప్, పీపీఎఫ్ ఆటో డెబిట్ కలిగి ఉంటే తనిష్క్ నుంచి రూ.1,500 విలువైన వోచర్
✪ డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ రూపంలో రోజుకు రూ.2 లక్షల వరకు చెల్లింపులపై చార్జీల మినహాయింపు
✪ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్, తొలి ఏడాది డీమాట్ ఏఎంసీ ఫీజులు ఉండవు.