త్వరలో హైదరాబాద్ మెట్రోలో అత్యవసర వైద్యసదుపాయాలు

SMTV Desk 2019-03-11 14:46:24  hyderabad metro station, emergency first aid, metro rail

హైదరాబాద్‌, మార్చ్ 11: హైదరాబాద్ లోని మెట్రో రైలులో త్వరలో అత్యవసర వైద్యసదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. మెట్రో ప్రయాణీకులకు ప్రయాణంలో ఎటువంటి ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా కొద్ది నిమిషాల్లో బాధితుడిని ఆదుకునే మెకానిజం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ మెట్రోరైటు సంస్థ మేనేజింగ్‌ డైరెకట్‌ ఎన్విఎస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణం చేసే సమయంలో ఇబ్బంది తలెత్తినపుడు కోచ్‌లో ఉన్న ఎమెర్జెన్సీ అలారమ్‌ను ప్రయాణికుడు నొక్కగానే ట్రైన్‌ ఆపరేటర్‌ అందుబాటులోకి వస్తారు. ప్రాథమిక చికిత్స చేసేందుకు సిబ్బందితో పాటు అంబులెన్స్‌ ఏర్పాటు చేసి దగ్గరల్లో ఉన్న ఆసుపత్రికి తరలించాలని సూచిస్తారు. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడిని అంబులెన్స్‌లోకి తరలించడానికి నిర్ణీత సమయానికి మించి రైలును నిలిపివేస్తామని తెలిపారు. కోచ్‌లతో పాటు అన్ని స్టేషన్లలో ఫస్ట్‌ ఎయిడ్‌ రూమ్స్‌, వీల్‌చైర్‌, ఫైర్‌ బ్లాంకెట్స్‌, వైట్‌ బెడ్‌షీట్స్‌, ఫస్ట్‌ ఎయిడ్‌బాక్స్‌ ఉంటాయని తెలిపారు.