ఈ సినిమా హిట్ కావాలి : రాజమౌళి

SMTV Desk 2019-03-11 13:46:18  rajamouli,

హైదరాబాద్, మార్చ్ 11: ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో .. కరణ్ జొహార్ నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా బ్రహ్మాస్త్ర రూపొందుతోంది. బిగ్ బి అమితాబ్ .. రణ్ బీర్ కపూర్ .. కింగ్ నాగార్జున .. అలియా భట్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. భారత దేశంలో మొట్టమొదటి మైథలాజికల్ త్రయాలజీ డ్రామాగా ఈ చిత్రం నిర్మితమవుతోంది.

ఈ సినిమా హిందీ టైటిల్ లోగోను ఇటీవల ప్రయాగ లో లాంచ్ చేసిన సంగతి విదితమే . తాజాగా తెలుగు టైటిల్ లోగోను రాజమౌళి తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. బ్రహ్మాస్త్ర టైటిల్ లోగో చాలా బాగుందని చెబుతూ, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు.బ్రహ్మాస్త్రం మూడు భాగాలుగా చూపించినట్టు ఈ సినిమాను కూడా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి టైటిల్ లోగోతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మూవీ మేకర్స్ సినిమాతో ఎలాంటి సంచనాలు నమోదు చేస్తారో చూడాలి. ఇప్పటికే మహాశివరాత్రి సందర్భంగా 150 డ్రోన్ కెమెరాలతో ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఈ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను క్రిస్మస్ కానుగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్...నమిత్ మల్హోత్రకు చెందిన ఫాక్స్ స్టార్ స్టూడియోళ్లతో కలిసి తెరకెక్కిస్తున్నాడు.