నిద్రలో గురకపెడుతున్నందుకు తుపాకీతో కాల్చేసిన మహిళ

SMTV Desk 2019-03-11 11:40:32  women kills her boy friend, snored, florida, police case

ఫ్లోరిడా, మార్చ్ 11: ఫ్లోరిడాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ నిద్రలో గురకపెడుతున్నాడని ఆ టార్చర్ భరించలేక అతన్ని తుపాకీతో కాల్చేసింది. ఈ వింత సంఘటన ఫ్లోరిడాలోని కొకొవాలో జరిగింది. పూర్తి వివరాల ప్రకారం...కొకొవా ప్రాంతానికి చెందిన లోరీ మోరిన్ అనే మహిళకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను నిద్రలో గురక పెడుతుండేవాడు. అయితే ఈ విషయంలో అతనితో ఆమె తరచూ గొడవపడేది. దాంతో అతను గురకలు రాకుండా ముక్కుకు పెట్టుకునే ‘నోస్ స్ట్రిప్స్’ కూడా తెచ్చుకున్నాడు. కానీ అవి సరిగా పని చేయకపోవడంతో మళ్లీ గొడవ పడిన ఆమె పక్కన బీరువాలో ఉన్న తుపాకీ తీసి అతన్ని కాల్చేసింది. తుపాకీ శబ్దం విన్న పక్కింటి వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితురాల్ని అరెస్టు చేసి, ఆమె బాయ్‌ఫ్రెండును ఆస్పత్రికి తరలించారు. అతని ప్రాణానికి ఎటువంటి ప్రమాదమూ లేదని వైద్యులు స్పష్టం చేశారు.